మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గొర్రెపాటి మాధవరావు హఠాన్మరణం పట్ల మా సంస్థ ఉభయ రాష్ట్రాల కమిటీలు ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాయి.
హక్కుల అంశాలపై ఆయన రాసిన వ్యాసాలు, ప్రజల హక్కులు ఉల్లంఘించబడిన సందర్భాలలో ఆయన రూపొందించిన నివేదికలు, ఉపన్యాసాలలో ఆయన చేసిన విశ్లేషణలు మానవ హక్కుల అవగాహనను పటిష్టం చేయడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. హక్కుల రంగంలో ఆయన చేసిన కృషిని మా సంస్థ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు నివాళి అర్పిస్తున్నది.
వేమనవసంతలక్ష్మి,
ఎస్.జీవన్ కుమార్
ఎ. చంద్రశేఖర్
వి.ఎస్. కృష్ణ
మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటి సభ్యులు
28-12-2024
హైదారాబాద్