స్త్రీ, పురుష సమానత్వం గురించి హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలకు చిత్త శుద్ధి కరువైందని, స్త్రీలు చైతన్యవంతమై హక్కులు అమలు కోసం ఉద్యమించాలని ముఖ్య వక్త మానవ హక్కుల కార్యకర్త, అసోసియేట్ ప్రొఫెసర్ కె. వల్లి అన్నారు.
ఆదివారం అంబేద్కర్ సామాజిక భవనంలో మహిళా దినోత్సవ సందర్భంగా” బహుజన సమాజ్ పార్టీ, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “మహిళా సదస్సు “మాజీ సర్పంచ్ చింతా వెంకటరమణి అధ్యక్షతన జరిగింది. రాజకీయంగా, సామాజికంగా మహిళలు ఎప్పుడు అభివృద్ధి చెందారో, అప్పుడే నిజమైన సాధికారికత ఏర్పడుతుందని ఆమె అన్నారు. స్త్రీలు రాజకీయంగా పదవులు పొందినప్పటికీ ఇంకా పురుషుల అధిపత్యంలోనే మెలగాల్సిన అవసరం ఏర్పడడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ కోసం ఏర్పాటుచేసిన మహిళా బిల్లు అమలు కోసం ఉద్యమించాలన్నారు.
సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ప్రధానమైనదని, మహిళలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని మల్కిపురం ఎం పి పి మెడిచర్ల వెంకట సత్యవాణి అన్నారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం ఆందోళన చెందవలసిన అంశం అన్నారు.
రాజ్యాంగం లో మహిళలకు అనేక హక్కులు కల్పించినప్పటికి వాటిని అందుకోవడం లో వెనకబడి ఉన్నారని పలువురు వక్తలు అబభిప్రాయపడ్డారు.లింగ సమానత్వం సాధిస్తామని ప్రతిజ్ఞ చేసారు. మహిళా పారిశుధ్య కార్మికులకు సన్మానం చేసారు.
ఈ కార్యక్రమం లో మల్కిపురం జెడ్ పి టీ సి సభ్యురాలు బల్ల ప్రసన్నకుమారి, మల్కిపురం సర్పంచ్ గెడ్డం రాజ్యలక్ష్మి, రిటైర్డ్ టీచర్ శెట్టిబత్తుల ఎలిజబెత్ రాణీ, సామాజిక కార్యకర్త బోనం రాజు, బి ఎస్ పి జిల్లా ఈ సి మెంబర్ బత్తుల లక్షమనరావు, జాన్ మోసే, ఆకుమర్తి భూషణం, జనిపల్లి నాని,హెచ్ ఆర్ ఎఫ్ రాష్ట్ర నాయకులు ఏడిద రాజేష్, ఆకుమర్తి రవి, మహ్మద్ ఇక్బాల్,ముత్యాల శ్రీనివాసరావు,నల్లి ప్రసాద్, పోలుకొండ స్రవంతి,గెడ్డం రేచల్ జ్యోతి, మోకా శ్రీనుబాబు, ఎ వీరలక్ష్మి, సి హెచ్ దుర్గ, ఎ పావని, సి హెచ్ ఉష, కుమార్ టి తదితరులు పాల్గొన్నారు.
మల్కిపురం,
09.03.2025.