మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల పదవ మహాసభలు డిసెంబర్ 14, 15 తారీకుల్లో అనంతపురంలో జరుగుతున్న సందర్భంగా మలికిపురం అంబేద్కర్ సామాజిక భవనం వద్ద కరపత్రం ఆవిష్కరణ జరిగింది.
ఈ మహాసభలో కులగణన ఎందుకు అవసరం, బస్తర్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు, ఎన్ఈపి-2020: కాషాయికరణ- కార్పొరేటీకరణ అంశాలపై ప్రసంగాలు ఉంటాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక సభ్యులు జనిపల్లి నాని, ముత్యాల శ్రీనివాసరావు, చవ్వాకుల వెంకట్, గెడ్డం రేచల్ జ్యోతి, బిఎస్పీ నాయకులు ఆకుమర్తి భూషణం, చైతన్య సమితి కార్యవర్గ సభ్యులు గెడ్డం బాలరాజు, జామా మజీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రహీం, మహమ్మద్ షాబా మాస్టర్ పాల్గొన్నారు.