కొత్త మైసంపేట గ్రామాన్ని సందర్శించిన మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ
పులుల సంరక్షణ పేరుతో అమాయక గిరిజన కుటుంబాలను ఉన్న చోటు నుండి వేరే ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మానవ హక్కల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగ్ రావ్ అన్నారు. ఈ సందర్బంగా కడెం మండలం లోని కొత్త మైసం పేట గ్రామాన్ని ఈరోజు మానవ హక్కుల నిజ నిర్దారణ కమిటీ తో సందర్శించారు ఈ సందర్బంగా స్థానిక ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోనాయక్ పోడ్ తెగకు చెందిన దాదాపు 94 కుటుంబాలు ఉన్నాయి. కాగ వారికి గత ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పునరావాసం కల్పించడం లో పూర్తిగా విఫల మయ్యిందని గ్రామస్తులు వాపోయారు.ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 2 ఎకరాలు అటవీ భూమి ఇచ్చారాని,అలాగే నివాసం కోసం డబుల్ బెడ్ రూం నిర్మించినప్పటికీ అవి పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని,గతంలో తునికాకు సేకరించే వాళ్ళం అలాగే బొంగులతో తడకలు అల్లుతు ఉపాధి పొందే వాళ్ళం. ఇక్కడకి వచ్చిన నుండి ఎలాంటి ఉపాధి లేక ఇతరత్ర పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లో కొట్టు మిట్టడుతున్నామని వారన్నారు.ఆసుపత్రి, పాఠశాల, మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా వరకు అందట్లేవని మానవ హక్కుల నిజ నిర్ధారణ కమిటీ ద్వారా అయినా మా సమస్యలు ప్రభుత్వనికి తెలియజేయాలని వాపోయారు.కాగా ప్రభుత్వం దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్లి గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తామని
పై సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మరియు అటవీ శాఖ ఐటీడీఎ అధికారులు నిర్వసితులైన ఆదివాసులను రక్షించడంలో విఫలమయ్యారని తేలింది, నిజ నిర్ధారణ కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలు రాజ్యాంగ విరుద్ధంగా సమాజంలోని మనిషి జీవించే హక్కులను భంగం కలిగించినట్టు తేలింది మనిషి జీవించే హక్కులను రక్షించాల్సిన అడవి హక్కుల చట్టం అటవీ జంతువుల రక్షణ చట్టం కూడా అడవిలో నివసిస్తున్న మానవులను మనుషుడిగా గుర్తించాలి అటవీ హక్కుల చట్టం 2006లో ఉన్న అంశాలను కూడా అధికారులు ధిక్కరించినారు మీరు జీవించే హక్కులను కాల రాసినందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు అధికారులే బాధ్యత వహించాలని మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ కమిటీ తెలియపరచుచున్నది కావున నిర్వాసిత గ్రామమైన కొత్త రాంపూర్ మైసమ్మపేట ప్రజలను అటవీ హక్కుల చట్టం ప్రకారం అన్ని వసతులు కల్పించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమం లో మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యులు రఘూత్తమ్ రెడ్డి,కాంబ్లె ప్రజ్ఞశీల్, అతిష్ కుమార్ గోపినాథ్ సొన్ కాంబ్లె పాల్గొన్నారు.
కడెం,
02-03-2025.