ఆర్టికల్ 38, 39 అమలు కోరుతూ పాదయాత్ర – మానవ హక్కుల వేదిక వరంగల్ జిల్లా కమిటీ

ఆర్టికల్ 38,39 అమలు కోరుతూ పాదయాత్ర – మానవ హక్కుల వేదిక వరంగల్ జిల్లా కమిటీ

రాజ్యాంగం లో ఆదేశిక సూత్రాలు 38,39 ప్రకారం సంపద, వనరుల పంపిణీలో మొత్తం ప్రజలు భాగస్వాములు గా ఉండాలి అని, అసమానతలు తగ్గించాలని చెపుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం

పోయిన సంవత్సరం డిసెంబర్ లో ‘ బిజినెస్-స్టాండర్డ్.కామ్ అనే సంస్థ ఒక నివేదికను తయారు చేసింది. అందులో పేద ధనిక ప్రజలనే కాక భారతదేశ ప్రత్యేకత ఐన వర్ణ వ్యవస్థ, కులాల పరంగా ఉన్న ఆర్ధిక అసమానతలను దృష్టిలో ఉంచుకొని ఈ నివేదిక రూపొందించారు. అదేంటో చూద్దాం.

భారత దేశపు సంపదలో బిలియనీర్లు 88.4% గా అగ్ర వర్ణాల వారు, బి.సీ లు , ఎస్సీ. లు, ఎస్టీ లు మరియు మిగిలిన వారు సంపదలో మిగిలిన భాగాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఎంటర్ ప్రైజెస్ యాజమాన్య కోటాలో ఎస్సీ లు 11.4% మంది మాత్రమే, ఎస్టీ లు ఎంటర్ప్రైజ్ యజమానులుగా 5.4% మంది ఉన్నారు.కానీ శ్రామిక శక్తిలో ఎస్సీ లు 19.3% గా, ఎస్టీ లు 11.4% గా ఉన్నారు.

ఎంటర్ప్రెన్యూర్ ల లెక్కలు 2023 సం॥లో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ నివేదిక ఆధారంగా మనం చూడవచ్చు. అట్లాగే 2018-19 ఆలిండియా “డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే ప్రకారం గా “ జాతీయ సంపదలో 55% అగ్రవర్ణాల వారు కలిగి ఉన్నారు “ అని సూచించారు.ఈ సంపద కేంద్రీకరణ- అసమానతలు భారతదేశ కుల వ్యవస్థ లో పాతుకుపోయిన నిరంతర ఆర్ధిక అసమానతలను ఎత్తిచూపిస్తుంది. కులం, ఆర్ధిక అసమానతల వల్ల జనాభా యొక్క విద్య, ఆరోగ్య భద్రత, బ్యాంకింగ్, మరియు క్రెడిట్ అంశాలను ప్రభావితం చేస్తాయి అని నివేదికలు చెబుతున్నాయి. నిజానికి ముఖ్యంగా దళితులు భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల పై నిషేదాన్ని ఎదుర్కొన్న ఫలితంగా వారి ఆర్ధిక పురోగతి ని తీవ్రంగా తగ్గించారని నివేదికలు పేర్కొంటున్నాయి.

బి.సీ లను కూడా కలుపుకుంటే మొత్తం దిగువన ఉన్న 50% మంది కి మొత్తం దేశ సంపద లో” కేవలం 6.4%” మాత్రమే కలిగి ఉంటారు. కానీ సంపన్నమైన 1% శాతం మంది కి 40.1% సంపదలో వాటా కలిగి ఉన్నారు అని నివేదికలో పేర్కొన్నారు.

మరింత ఆశ్చర్యం కలిగించే విధంగా 0.001% మంది దేశ సంపద లో 17% కలిగి ఉన్నారు అంటే సంపన్నులైన 10,000 మంది భారతీయులు దిగువన ఉన్న 50 శాతం భారతీయుల కంటే 3 రెట్లు అధికంగా సంపన్నలు గా ఉన్నారు.
అందుకే రాజ్యాంగం లో ని ఆదేశిక సూత్రాలు 38,39 అమలు డిమాండ్ చేయాల్సిన అవసరం, భాధ్యత దేశ ప్రజలకు ఉన్నది.

హనుమాన్ ప్రసాద్
మానవ హక్కుల వేదిక

Related Posts

Scroll to Top