మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో హక్కుల నేత ఆచార్య బుర్ర రాములు 15వ వర్ధంతి సందర్భంగా ఘనంగా గురువారం నల్లగొండ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక ప్రతినిధి చింతమల్ల గురువయ్య మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఆచార్యునిగా బుర్ర రాములు మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిన ప్రతిసారి ప్రజల తరఫున ముందుండి పోరాడి మార్గదర్శిగా నిలిచారని వారి స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.నేడు సామాజిక,రాజకీయ ఆర్థిక పరిస్థితులలో మానవ హక్కులు నానాటికి అననం కాపాడుతున్న దృష్ట్యా ప్రతి పౌరుడు చైతన్యవంతమై ప్రశ్నలాగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జీ మోహన్ మాట్లాడుతూ ఆచార్య బుర్ర రాములు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు జీవితాంతం కట్టుబడి పనిచేసిన మానవ హక్కుల ఉద్యమకారుడని కొనియాడారు. విద్యార్థులు, రైతులు, కార్మికులు, దళితులు, గిరిజనులు వంటి అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు.రాష్ట్రంలో జరిగిన ఎన్నో ప్రజా సమస్యలపై ఆయన గొంతెత్తి ప్రశ్నిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేశారని గుర్తుచేశారు.ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, హక్కుల ఉల్లంఘనలపై నిర్భయంగా స్పందించడంలో ఆయన పాత్ర విశిష్టమని పేర్కొన్నారు.అదేవిధంగా యువతలో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు బుర్ర రాములు చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. సమానత్వం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అక్కినపల్లి వీరస్వామి, రాష్ట్ర నాయకులు మోహన్, చింతమల్ల గురవయ్య, కే.పర్వతాలు, పందుల సైదులు, ఇందూరి సాగర్, వెంకటరమణ,లక్ష్మల్ల మధు, జానకిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాభివందనాలతో..
అక్కెనపల్లి వీరస్వామి
మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు
14.05.2026,
నల్లగొండ.