మానవ హక్కుల వేదిక 10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలి

మానవ హక్కుల వేదిక (HRF) ఈనెల 14, 15 తేదీలలో (శని, ఆదివారం )10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలు అనంతపురంలో జరుపుకుంటుంది. అనంతపురం లోని సాయి నగర్ నందున్న అంబేద్కర్ భవన్ నందు సభలు జరుగుతాయి.

రాష్ట్ర మహాసభల సందర్భంగా 14 డిసెంబర్, 2024 తేది, శనివారం సంస్థాగత కార్యక్రమాలు, 15 వ తేది ఆదివారం రోజున వివిధ సామాజిక అంశాలపై ఉపన్యాసాలు ఉంటాయి. . ‘కులగణన ఎందుకు అవసరం?’ అన్న అంశంపై సామాజిక విశ్లేషకులు, మాజీ రాష్టపతి K. R. నారాయణన్ OSD గా పనిచేసిన S. N. సాహు గారు; ‘బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు’ అన్న అంశం పై స్వంతంత్ర విలేఖరి మాలిని సుబ్రహ్మణ్యం గారు; ‘నూతన విద్యా విధానం (NAP) 2020: కాషాయికరణ, కార్పొరేటీ కరణ’ అన్న అంశంపై చరిత్ర పరిశోధకులు , అధ్యాపకులు కొప్పర్తి వెంకట రమణలు ప్రసంగిస్తారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువజనులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు పెద్దఎత్తున హాజరై మానవ హక్కుల వేదిక ( HRF ) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.

మానవ హక్కుల వేదిక
ఆదోని
08.12.2024.

Related Posts

Scroll to Top