మల్కిపురం మండలం, మలికిపురం గ్రామం చెరువు గుంట ప్రాంతంలో గత 40 సంవత్సరములుగా నివాస స్థలములకు దారి లేక ఇబ్బంది పడుతున్న 25 కుటుంబాల అభ్యర్థన మేరకు నిజ నిర్ధారణ చేపట్టిన మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, బహుజన్ సమాజ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఆకుమర్తి భూషణం మరియు జనపల్లి నాని.
ప్రతి ఎన్నికల్లోనే ప్రజాప్రతినిధులు ఓట్లు కోసం వచ్చి వాగ్దానం చేయడం తదనంతరం మర్చిపోవడం 40 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కరెంటు సౌకర్యము, రోడ్డు సౌకర్యము ఏర్పాటు చేయాలని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.