Author name: Human Rights Forum

Reports (English)

Citizens’ Report on Security and Insecurity

In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.

Press Statements (Telugu)

హక్కుల నేత గొర్రెపాటి మాధవరావు గారికి మానవ హక్కుల వేదిక నివాళి

మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాల

Press Statements (Telugu)

మాధవరావు గారికి నివాళి

మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, గొర్రెపాటి మాధవరావు హఠాన్మరణం పట్ల మా సంస్థ ఉభయ రాష్ట్రాల

Our Writers

చేనుమెస్తున్న కంచె – మార్పు శరత్ (25.12.2024, ఉత్తరాంధ్ర)

ఇందులో దాపరికమేమిలేదు, సూటిగానే చెప్తున్నాను. చేను విశాఖ ఉక్కు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలే ఆ కంచె. రక్షించాల్సిన ఆ పచ్చని కర్మాగారాన్ని బక్షిస్తున్నది కేంద్ర రాష్ట్ర

Press Statements (Telugu)

మందమర్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకులపై పోలీసుల వేధింపులు ఆపాలి

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై, ఐడీ పార్టీ పోలీసులు తాము చేయని నేరాల్లో ఇరికించాలని

Press Statements (Telugu)

కౌలు రైతుల హక్కుల చట్టం తీసుకురావాలి

ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు,కౌలు రైతుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించడం జరిగింది. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి కి చెందిన కాట్రావుల

Press Statements (Telugu)

నేటికీ వివక్షకు గురవుతున్న శిరోముండనం బాధితులు

కులధృవీకరణ పత్రాలు మంజూరులో అధికారుల అలసత్వం వెంకటాయపాలెం శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం పిల్లలకు కులధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని మానవ హక్కుల

Press Statements (Telugu)

మతిస్థిమితం లేని అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

ఆస్పరి మండలం, జొహరాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని 35ఏళ్ళ తన కూతురిని ముత్తుకూరు గ్రామానికి చెందిన హనుమంతు నమ్మించి అత్యాచారానికి పాల్పడినాడని బాధితురాలి తండ్రి ఆరోపణలు

Books (Telugu)

కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం

రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్‌ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్‌, సచార్‌ కమిషన్‌ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది పొందే లేదా నష్టపోయే వర్గాలు మాత్రమే ఈ నివేదికలను చదివి వాటి సిఫార్సులను అమలు చేయమనో, తిరస్కరించమనో ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తుంటాయి. అవే ఎక్కువగా మీడియాలో వార్తలుగా వస్తుంటాయి. అయితే బాలగోపాల్‌ గారు తన హక్కుల ప్రయాణం ప్రారంభ దశ నుండి ప్రజా ప్రయోజనం ఉన్నాయనుకున్న అన్ని కమిటీలకు, కమిషన్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిషన్ల నివేదికలపై కూడా స్పందిస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య సంవాదంలోనూ, సామాజిక న్యాయ సాధనలోనూ వాటి పాత్రను ఆయన గుర్తించి, గౌరవించినట్టుగా ఇంకెవరూ చేసినట్టు కనిపించదు.

Books (Telugu)

రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం

తమ న్యాయమైన వాటా అడిగే వర్గానికి, ముఖ్యంగా నాయకత్వానికి, తమ ఈ భౌతిక పరిస్థితికి కారణం ఎవరు, మనం ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఏమిటి అనేది అవగాహన ఉండాలి. తమ డిమాండు ఎంత  న్యాయమైనదైనా తమ వేదికల నుండి వెళ్లే సందేశం దీర్ఘకాలికంగా నష్టం చేయకుండా ఉండాలి . ముఖ్యంగా సామాజిక అంతరాల పరిష్కారంలో అవతలి పక్షం మనసులు గెల్చుకోవటం అనేది సమస్య పరిష్కారాన్ని ఎంతో సులభతరం చేస్తుంది. అలాగే ఏ కారణాల వలన తాము ఒక న్యాయమైన సదుపాయాన్ని సాధించుకున్నామో దాన్ని తమలోని వారికే నిరాకరించడం, అందుకు ఆధిపత్య కులాల వారి వాదనలనే ఆలంబన చేసుకోవడం వర్గీకరణ వ్యతిరేకవాదులకు కూడా తగని పని. తమ వెనుకబాటుకు ఏ రకంగా కూడా కారణం కాని, తమతో పాటు సామాజిక వెలిని అనుభవించిన కులంలోని తటస్తుల, ఉదారవాదుల మద్దతునైనా మాదిగ ఉద్యమం కూడగట్టుకోలేకపోవడం ఒక సమస్య అయితే, మాల వర్గంలోని మేధావులు ఈ విషయంలో తీసుకోవాల్సినంత చొరవ తీసుకోకపోవడం మరో సమస్య. ఏది ఏమైనా అది గతచరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాం. వర్గీకరణను ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్న వాదనల్లో చాలావరకు కాలం చెల్లినవి లేదా పూర్తిగా అసంబద్ధమైనవి. వర్గీకరణను ఎలా చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని హేతుబద్ధంగా పరిష్కరించుకోవచ్చు.

Scroll to Top