హెచ్ఆర్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం

మానవ హక్కుల వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యి.. మాట్లాడారు. హక్కుల కార్యకర్తలు కులం, మతం, బంధుత్వ పక్షపాతం లేకుండా భాదితుల పక్షాన నిలబడి పనిచేయాలని అన్నారు.హక్కులకు భంగం కలిగినప్పుడు స్పందించటమే మానవ హక్కుల కార్యకర్తల ద్యేయంగా ఉండాలని,ఏదైనా సమస్యపై నిజానిర్ధారణ చేశాకే మాట్లాడాలని కోరారు.అనంతరం వక్తలు పలు విషయాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులపై న్యాయవాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హెచ్ఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ళ రంజిత్ కుమార్ వివరించారు.

మానవ హక్కుల వేదిక అవగాహన – ఆచరణ రూపాలు..అనే అంశంపాయి ఉమ్మడి వరంగల్ జిల్లా హెచ్ఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి వి.దిలీప్ అవగాహన కల్పించారు.సామాజిక జీవితం పౌర బాధ్యత..టి హరికృష్ణ,మానవ హక్కుల భావన, చరిత్ర అంశంపై రాష్ట్ర అధ్యక్ష ఆత్రం భుజంగరావు,ప్రధాన కార్యదర్శులు డా.ఎస్ తిరుపతయ్య లు వివరించారు.ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్,సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆత్రం సుగుణక్క ప్రత్యేక ఆహ్వానితురాలుగా హాజరై భారత రాజ్యాంగం, మహిళల హక్కులను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హెచ్ఆర్ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,`సుజిత్ ఖాన్, వెంకటేశ్వర్,అవినాష్,సిడం తిరుపతి, నగేష్,శ్యామ్ రావ్,జ్ఞానేశ్వర్, జ్యోతిరాం,రంగయ్య, జగన్ సభ్యులు,వివిధ ప్రజా సంఘాల నాయకులు నేతవత్ రాందాస్, సిడం జంగు దేవ్,గేడం గోపీచంద్, తదితరులు పాల్గొన్నారు.

ఉట్నూర్,
08-06-2025

Related Posts

Scroll to Top