75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో మానవ హక్కుల వేదిక రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిపారు. విద్యార్థుల మధ్య జరిగిన సదస్సులో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎస్. తిరుపతయ్య మాట్లాడుతూ రాజ్యాంగం మౌలిక స్వరూపం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను విద్యార్థులకు వివరించారు. భారత రాజ్యాంగం కలలుగన్న భారతదేశంలో పౌరులందరికీ హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధించటం పౌరులందరికీ రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని సమాన ప్రాతిపదికగా అందించడం పాలకుల కర్తవ్యంగా ఉండాలన్నారు. భారత సుప్రీంకోర్టు నిన్న భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో 1976 లో 46 రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలను ప్రవేశపెట్టడం సరైనదే అని తీర్పు ఇవ్వటాన్ని ఆహ్వానిస్తున్నాం అన్నారు.
చివరగా ప్రశాంత్ గారు విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశికను చదివి, సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త పుల్లూరి సంపత్ రావు గారు మరో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. స్రవంతి జూనియర్ కాలేజ్ యాజమాన్యం రెహమాన్, విజయ్ మరియు మానవ హక్కులు వేదిక సభ్యులు అచ్యుత్, ప్రశాంత్, పవన్ లు పాల్గొన్నారు.
— డా. ఎస్. తిరుపతయ్య
(రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక తెలంగాణ).