నాటుసారా మరణాలపై మానవ హక్కుల వేదిక విచారణ

ఎక్సైజ్ వైఫల్యమే వల్లేనని ఆరోపణ; శారదాపురం వాసులు పిర్యాదు మేరకు గ్రామంలో విచారణ!

సోంపేట మండలం మాకన్నపల్లి పంచాయతీ శారదాపురం గ్రామం లో కల్తీ సారాతాగి 30 రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారని, ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించికోలేదని ఆరోపిస్తూ మృతుల కుటుంబాలకు చెందిన బాధితులు మానవ హక్కుల వేదికకు పిర్యాదు చేసారు. పిర్యాదు నేపథ్యంలో వాస్తవాలు పరిశీలించేందుకు హ్యుమన్ రైట్స్ వేదిక కుటుంబ సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులు శనివారం గ్రామంలో పర్యటించి మృతుల కుటుంబ సభ్యులు నుంచి మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ధారణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానవ హక్కుల వేదిక కెవి జగన్నాధరావు, బీన ఢిల్లీ రావు జిల్లా కార్యదర్శి ఎస్ వెంకటరావు జిల్లా కార్యవర్గ సభ్యులు, చౌదరి లక్ష్మణరావు ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్షులు వచ్చి కారణాలు ఆరాతీశారు. ఇటీవల కొన్ని వారాల వ్యవధిలో కల్తీ సారా తాగి గ్రామానికి చెందినబతకల పాపయ్య (52) , బద్రి దాలయ్య ( 68), కొవ్వూరు, కృష్ణా రావు (53) తో పాటు పక్క పక్క గ్రామాల్లో ఉన్న మరో ఇద్దరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామములో ఒరిస్సా సరిహద్దు ప్రాంతము నుండి కల్తీసారా యదేచ్చగా చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముతున్న సంబంధిత అధికారులు ప్రేక్షకులుగా మిగిలిపోయారని కమిటీ ఆరోపించింది. ఈ కారణంగానే ఐదుగురు చావుకు అధికారులే కారణమని, వీళ్ళకి తక్షణం ప్రభుత్వం తగిన నష్టపరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసి ఇటువంటి చావులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక ఈ సందర్భంగా డిమాండ్ చేసింది . జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా గ్రామస్తులు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. ఈనెల 23వ తేదీన గ్రామస్తులు తో మానవ హక్కుల వేదిక కలసి జిల్లా కలెక్టర్, ఎస్సీ లను కలిసి ఫిర్యాదు చేస్తామని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఒరిస్సా కి ఆనుకొని ఉన్న గ్రామాలలో నాటు సారా అమ్మకాలను పూర్తిగా నియంత్రణ చేయవలసిన అవసరం ఉందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి తగిన చర్యలు తీసుకోక పోతే ఇలా మరిన్ని నాటుసారా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. సోంపేట, మందస మండలాల పరిధిలో గిరిజన గ్రామాల్లోనే కాక ,అనేక గ్రామాల్లో నాటుసారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నా, పోలీసులు ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారని,కమిటీ ప్రశ్నించారు.

సోంపేట,
14.09.2024

Related Posts

Scroll to Top