నాసిరకం విత్తనాలు, ఎరువులు, కల్తీ రసాయన మందులు అమ్ముతున్న వ్యాపారుల పై కేసులు నమోదు చేయాలి.

శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ నల్లగొండ గారికి నమస్కరించి మనవి చేయునది

ఆర్యా!

విషయం:-

  1. వ్యవసాయం కొరకు రైతులు కొనుగోలు చేస్తున్న మార్కెట్లో నాసి రకం విత్తనాలు,నాసి రకం ఎరువు లు, కల్తీ రసాయన మందులు అమ్ముతున్న వ్యాపారులపై నేరం కేసులు నమోదు చేయుట గురించి.
  2. రైతులకు నేరుగా ప్రభుత్వమే విత్తనాలు సప్లై చేయాలి, జిల్లా లోని ఆయా మండల కేంద్రాలల్లో వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాల స్టాల్స్ ఏర్పాటు చేయాలని విన్నపం గురించి.

పై విషయం లో తమరికి మనవి చేయునది నల్లగొండ జిల్లా రైతాంగం సరైన వర్షాలు పడక ఎదురుచూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడక్కడ కొద్దికొద్దిగా పత్తి విత్తనాలు వేయడం జరిగింది. బోర్ల యందు నీరు వసతి ఉన్నవారు నారుమల్లు సా గు చేసు కుంటూ కొద్దికొద్దిగా వరి మల్లు తడుపుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనపడుతుంది.

ఈ పరిస్థితులలో మార్కెట్లో రైతు నుగోలు నందు విపరీతమైన దోపిడికి గురవుతున్నాడు. విత్తనపు వడు,పత్తి, కందులు, పెసలు, బీర, కాకర, గోగులు, దోస, చిక్కుడు, బెండ తదితర నాసిరకం విత్తనాలు ఎక్కువ ధరలతో అమ్మడం జరుగుతోంది. ఈ సీజన్లో ట్రేడర్ చెప్పిందే రేటుగా నడుస్తుంది.

ఎరువులు :- నాణ్యత లేని కల్తీ ఎరువులు రసాయన మందులు:-ఎన్నో

రకాల మందులు మార్కెట్లోకి తెచ్చి పురుగు మందులు పిచికారి చేయించడం జరుగుతుంది. ఒక్కటి కొడితే నివారణ కాలేదంటే ఇంకొకటి ఇచ్చి కొట్టించుతున్నారు, రెండు మూడు సార్లు లేదా నాలుగు సార్లు మందులు పిచికారి చేయకుంటే పంట చేతికి రాని పరిస్థితి నెలకొంది. అధికారుల పర్యవేక్షణ లేని మూలంగా నాసిరకం విత్తనాలు, కల్తీ ఎరువులు కల్తీ రసాయన మందులు ఎక్కువగా మార్కెట్లో విలయ తాండవం చేస్తున్నవి. వాటిని పదేపదే పర్యవేక్షణ చేస్తే, అక్రమ నిల్వలు కూడ బయటకు వచ్చే అవకాశం ఉన్నది. వరి విత్తనాలు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం దగ్గర 10 కేజీల (సన్నలు )విత్తనం బస్తా 560/- రూపాయలు, ఇదే బస్తా 10 కేజీల (సన్నలు) నల్లగొండ టౌన్ నందు వెయ్యి రూపాయల నుండి 1050/- వరకు అమ్ముతున్నారు. 10 కేజీల( సన్నలు) మిర్యాలగూడ నందు 1100 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమిటి ఇంత తేడా ? ఈ దోపిడికి అడ్డుకట్ట వేయాలని, దీనిని చెకింగ్ ద్వారా ఆవగలం, విపరీతమైన చెకింగ్ పెట్టి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని అన్ని రకాల గా ఆదుకోవాలని కోరుతున్నాం. రైతులకు మనోధైర్యం కల్పించుట కొరకు మార్కెట్లో మోసాలు అరికట్టాలని, రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే తమరికి తెలియజేయుటకు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసి, వ్యవసాయ మార్కెట్ల వద్ద బోర్డుల ద్వారా ప్రదర్శన (display) పెట్టాలని కోరుతున్నాం..

డిమాండ్స్:

  1. రైతులకు నేరుగా ప్రభుత్వమే విత్తనాలు సప్లై చేయాలి.
  2. జిల్లా లోని ఆయా మండల కేంద్రాలల్లో వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాల స్టాల్స్ ఏర్పాటు చేయాలి.
  3. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ షాపుల యజమానుల విద్య అర్హతలను చెక్ చేసి, అనర్హులపై చర్యలు చేపట్టాలి.
  4. నాసిరకం విత్తనాలు, నాసిరకం ఎరువులు, కల్తీ రసాయన మందులు అమ్ము తున్న వ్యాపారులపై నేరం కేసులు కేసులు నమోదు చేయాలి

నల్గొండ,
15.07.2024

Related Posts

Scroll to Top