డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను త్వరితగతిన అరెస్టు చెయ్యాలని, మైనర్ బాలికను సంరక్షించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ మేరకు శనివారం కిడ్నాప్ కు గురైన మైనర్ బాలిక ఇంటివద్ద, ఆమె చదువుకునే ప్రభ్యుత్వ పాఠశాల వద్ద నిజ నిర్ధారణ చేయటం జరిగినది.
ఈ సందర్భంగా బాలికకు పరిచయస్తురాలైన మహిళ దురుద్దేశపూర్వకంగా బాలికను నమ్మించి, అలాగే పాఠశాల ఉపాధ్యాయులను మోసం చేసి బాలికను అపహరించినట్లుగా మా నిజ నిర్ధారణలో వెల్లడయ్యింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. బాలికకు సంబంధించిన వ్యక్తుల వివరాలు నిర్దారణ చేయకుండా అపరిచిత మహిళతో బాలికను పంపడం ఏమిటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.బాలికను వీలైనంత త్వరగా కనుగొని,భాద్యులందరిపైనా కేసును నమోదు చేసి శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో మానవ హక్కులవేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు,రాజోలు పరిరక్షణ చైతన్య సమితి అధ్యక్ష కార్యదర్శులు నల్లి ప్రసాదరావు, మంద సత్యనారాయణ,బీఎస్పీ మలికిపురం మండల అధ్యక్షులు మోకా శ్రీను పాల్గొన్నారు.
మలికిపురం,
07/12/2024