నల్లగొండ జిల్లా, మోతే మండలంలోని రావి పహాడ్ గ్రామంలో NMK Bio Fuels Pvt. Ltd ఇతనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులను మరియు దాని పక్క గ్రామ రైతులను కలిసి ఫ్యాక్టరీ వలన జరుగు నష్టాల విషయంలో నిజనిర్ధారణ చేయడం జరిగింది.
రైతులు మాకు ఈ కంపెనీ గురించి మొదట్లో విత్తనాలు తయారు చేయు కంపెనీ అని చెప్పినరాని, తర్వాత మేము ఈ బాయిలర్ లు ఇవన్నీ ఏంటి అని అడగగా అప్పుడు ఇక్కడ ఇతనాల్ కంపెనీ పెట్టుచున్నామని మొక్కజొన్న, జొన్న, నూకల నుండి తయారు చేస్తామని చుట్టుపక్కల రైతులందరూ మొక్కజొన్న పండించాలని గవర్నమెంట్ రేటు కంటే ఎక్కువ మేము చెల్లిస్తామని చెప్పినారు అని అన్నారు. దీనివలన ఎటువంటి కర్బన రసాయన వాయువులు వెలువడవని చెబుతూనే వాయువులు బయటికి పోవడానికి 225 ఫీట్ల ఎత్తులో చెందిన ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని వాయువులే వెలవడినప్పుడు అసలు చిమ్మినే అవసరం లేదు కదా అని రైతులు అన్నారు. అంతేకాకుండా ఒక లీటర్ ఇతనాలకు మూడు నుండి 8 లీటర్ల వరకు నీరు అవసరం ఉంటుందని ప్రతిరోజు 1,50,000 లీటర్ల ఇతనాలు తయారు చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారని ఒక లక్ష యాభై లీటర్ల ఇతనా లకి 12 లక్షల లీటర్ల నీళ్లు ప్రతిరోజు అవసరం ఉంటుందని అవి పాలేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటామని కంపెనీ వాళ్ళు చెబుతున్నారని వ్యవసాయానికి ఉపయోగపడే బ్యాక్ వాటర్ ని ఈ విధంగా ఉపయోగిస్తే భూగర్భ జలాలు అడుగంటి పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీకి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని కంపెనీ వాళ్ళు అంటున్నారని మాకు మాతో పాటు ఉన్న సకల జీవరాసులకు జీవన విధానానికి ఆరోగ్యానికి చేటు కలిగించే ఈ ఫ్యాక్టరీలు పెట్టి మా అభిప్రాయాలు తెలుసుకునే విధానము లేదంటూ మా హక్కులను భంగం కలిగిస్తున్నారని అక్కడి రైతులు అన్నారు. మాకు నష్టం కలిగించే ఈ కంపెనీని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అభిప్రాయపడ్డారు.
అక్కడినుండి ఎన్ఎంకె కంపెనీ లోనికి వెళ్లగా అక్కడ కన్స్ట్రక్షన్ చేయిస్తున్న ఒక సివిల్ ఇంజనీర్ మరియు సూపర్వైజర్ ఇద్దరు కూడా పూర్తి సమాచారం ఇవ్వకుండా కంపెనీ నిర్మాణంకు సంబంధించిన స్కెచ్ మ్యాప్ మాత్రమే చూయిస్తూ మిగతా విషయాలు మాకు తెలవదని ఇక్కడ ఎటువంటి విషవాయువులు కార్బన్ వాయువులు వెలువడవని చెబుతూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న బాయిలర్లను వాడుతున్నామని బయటికి వచ్చిన వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ అవుతుందని వేస్ట్ తడి పదార్థం చాపల చెరువులకు పంపిస్తామని వారు చెబుతున్నారు. దానికి సంబంధించిన DPR ఇవ్వమంటే తరువాత పంపిస్తామని చెబుతున్నారు. వీళ్లకు పవర్ కూడా 3.2 మెగావాట్ల పవర్ ప్లాంట్ అవసరమని వారు సేకరించిన 16 ఎకరాలలోనే ఏర్పాటు చేస్తామని దాని నుండి కూడా కాలుష్య వాయువులు వెలువడవని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించడం లేదు.
మొత్తంగా మా పరిశీలనలో కంపెనీ యాజమాన్యం వాస్తవాలను దాచి పెడుతూ అక్కడి రైతులను ప్రజలను ప్రజాస్వామిక వాదులను మభ్యపెడుతూ కంపెనీ పూర్తిస్థాయిలో నిర్మాణం చేసేటట్లు పావులు కదుపుతున్నట్లుగా మా పరిశీలనలో తేలింది.
కాబట్టి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు అక్కడ వాస్తవాలు గ్రహించి అక్కడి రైతుల ప్రజల అభిప్రాయాలను ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తీసుకొని వారికి తగిన న్యాయం చేయాలని, చుట్టుపక్కల ఉన్న పంట పొలాలను గ్రామాలను దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీ ఏర్పాటును నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి వీరస్వామి, నాయకులు జి వెంకటరమణ, సిహెచ్ కాశీరాం, ఆర్ ప్రతాప్ లు పాల్గొన్నారు.
నల్లగొండ,
05.01.2024