మానవ హక్కుల వేదిక ఎస్.సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
30 ఏళ్ల పోరాటం తర్వాత ఎస్.సి వర్గీకరణ పై సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇవ్వకుండా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టటం ఓ రకంగా సమస్యను ఇంకొంత కాలం జాప్యం చేయడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంది అని వక్తలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికి ఆలస్యంగానైనా వర్గీకరణ చేసుకోవచ్చు అని ఇచ్చిన తీర్పును అన్ని పక్షాల వారు స్వాగతించారు.
చివరిగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానాలు:
- ఒక కాలపరిమితితో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ చేపట్టడానికి షెడ్యూల్ ప్రకటించాలి.
- ఎన్నికల హామీ అయిన కుల గణనను వెంటనే చేపట్టాలి.
- ఇప్పటివరకు అమలవుతున్న యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని వెంటనే ఎత్తివేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను అమలు పరచాలి.
- ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలి.
- ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలి.
- ఇప్పటికీ రిజర్వేషన్లు అమలుపరచని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో వెంటనే అమలు పరచాలి.
- క్రీమీలేయర్ నిబంధనను వెంటనే రద్దు పరచాలి.
ఈ సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి హరికృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అద్దునూరి యాదగిరి & వి. దిలీప్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు, ఎం.ఆర్.పి.స్ రాష్ట్ర నాయకులు మంద కుమార్, వి.సి.కె పార్టీ అధ్యక్షుడు జిలకర శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు సురేష్, వెంకటనారాయణ, జి పద్మజ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రియాంక, ఉపాధ్యాయ సంఘ నాయకులు నన్నేబోయిన తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్
22.09.2024