ఉపాధి పథకం ప్రారంభ రోజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతంలో ప్రభుత్వమే వేసవి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి కూలీలకు ఇచ్చే వేతనాలకు అదనముగా కలిపి వేసేవారని, ఈ పథకాన్ని కొన్ని సంవత్సరాలు పాటు అమలు చేసి గత పది సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో నిలిపివేశారని, తక్షణమే ఈ ఆర్థిక సంవత్సరం నుండి మజ్జిగ కేంద్రాలు పునః ప్రారంభించాలని సఖినేటిపల్లి మండలం, మోరిపోడు గ్రామంలో మంగళవారం ఉపాధి కూలీలు, మేట్స్ ఉపాధి కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాయి.
ఈ కార్యక్రమంలో ఉపాధి కూలి సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పథకం ప్రారంభ కాలంలో ప్రధమ చికిత్స పెట్టి, కూలీల విశ్రాంతి కోసం టెంట్ సౌకర్యం కల్పించే వారని, అలాగే గంప,పారా,తట్ట ఉపయోగించే కూలీలకు అదనపు భత్యం, మరియు మేట్స్ కు ప్రతికూలీ నుండి అదనపు భత్యం కల్పించే వారని ఈ సౌకర్యాలు అన్ని అమలు చేయడం ప్రభుత్వాలు మర్చిపోయాయని సంఘ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకం అమలులో అనేక మార్పులు రావడం వల్ల నేషనల్ ఇన్ఫర్మేమేటిక్ సిస్టం (NIC )రావడం వల్ల మేట్స్ కు అదనపు బాధ్యతలు ఏర్పడ్డాయని, ఈ సిస్టం ద్వారా ప్రతిరోజు రెండుసార్లు మస్తర్ తీయాల్సిన అవసరం ఏర్పడిందని,మస్టర్ కోసం ఆండ్రాయిడ్ (Andrid cell ) అవసరమవుతుంది. అలాగే సెల్ రీఛార్జ్ కోసం ప్రతినెల 300 రూపాయలు అవసరం అవుతుంది.
- ఈ ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వమే మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
- ప్రాథమిక చికిత్స కోసం మందుల పెట్టె సౌకర్యం కల్పించాలలి.
- ప్రతి ఉపాధి కూలీలకు అదనపు సౌకర్యాలు కల్పించాలలి.
- ప్రతి మేట్ కు సెల్ సౌకర్యంతో పాటు, రీఛార్జ్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
- ప్రతి మేట్ కు జీతభత్యాలు కల్పించాలి.
ఉపాధి కూలీల, మేట్స్ సమస్యలను గ్రామీణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఆలోచించాలని జిల్లా ఉపాధి కూలి సంఘం కోరుతుంది. ఈ కార్యక్రమంలో మేట్స్ మల్లాడి రమాదేవి, గెడ్డం దేవి, కుసుమ రమేష్, కడలి లక్ష్మి, లంకె తాతరాజు, రాపాక ధర్మారావు,, బొమ్మిడి శాంతమ్మ, వాతాడి సత్యనారాయణ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ముత్యాల శ్రీనివాసరావు
జిల్లా అధ్యక్షులు, ఉపాధి కూలీ సంఘం
సఖినేటిపల్లి,
05.05.2025.