యురేనియం తవ్వకాల వల్ల ప్రజల జీవనానికి జరగబోయే ప్రమాదం గురించి దేవనకొండ మండలంలోని ప్రభావిత గ్రామాలైన కప్పట్రాళ్ల, నెల్లిబండ, పి. కోటకొండ ప్రజలను మానవ హక్కుల వేదిక రాష్ట్ర, జిల్లా భాద్యులు పది మంది అక్కడి ప్రజలను విచారించడం జరిగింది. యురేనియం తవ్వితే అక్కడి వారికి వచ్చే ప్రయోజనాలేమిటి? స్థానికులకు జరిగే మేలేమిటి? అని ప్రశ్న వేసుకొన్నపుడు, ఏమీ లేవు అన్న విషయం తమకు భోదపడిందని వారు తెలిపారు. కడప జిల్లా, తుమ్మలపల్లిలో యురేనియం గనివల్ల అక్కడి ప్రజలకు జరిగిన మేలు శూన్యం. అణుధార్మిక వ్యర్ధాల మేట అక్కడి వారికి శాశ్వత ప్రమాదంగా వుంది. తమకు అదే జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు భూమిలో భద్రంగా నిక్షిప్తమై వున్న అణు భూతాన్ని బయటకు తీసి వదిలినట్లు అవుతుందని తెలిపారు. కావున అణు విద్యుత్ తమకు వద్దని చెప్పారు.
కావున యురేనియం అక్కడి ప్రజలకు ఎన్నటికీ ప్రధాన శక్తి వనరు కాలేదు. అది అన్నిటి కంటే చాలా ఖరీదయినది. సామాన్యుడికి అందుబాటులో వుండదు.
తవ్వకాలవల్ల అడవి నశిస్తుంది. జీవులు అంతరిస్తాయి. దానివల్ల జరిగే విద్యుత్ ఉత్పత్తికి మెరుగైన, ప్రమాదరహితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందువల్ల యురేనియం తవ్వకాలను అక్కడి ప్రజలు వ్యతిరేకించడమే సరైన మార్గమని వారు నమ్ముతున్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా యురేనియం ప్రతిపాదనను పూర్తిగా విరమించుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.
ఈవిషయమై వివరమైన పత్రికా ప్రకటన త్వరలో ఇవ్వడం జరుగుతుంది.
( V. S. కృష్ణ )
HRF ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు, విశాఖపట్నం.
( U. G. శ్రీనివాసులు )
HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు,
ఆదోని,
2-2-2025.