పి.గన్నవరం మండలం కుందాలపల్లి ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని వారు కోరారు.
కుందాలపల్లి ఘటనపై మానవ హక్కుల వేదిక (హెచ్ ఆర్ ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి నామాడి శ్రీధర్ శుక్రవారం కుందాలపల్లిలో బాధితులను కలిసి నిజనిర్థారణ చేశారు. దళితులైన కారణం చేత వారి మృతదేహాలను తమ వీధిలోంచి కాకుండా రివాజు వంకతో పంటచేల గట్టు మీంచి తీసుకువెళ్ళేలా చేస్తున్న వివక్షా పూరిత కుల కట్టుబాట్లను తొలగించాలని వారు అన్నారు.
దళితులు తమ స్మశానవాటికకు ఉన్న పక్కా రోడ్డు మార్గం ద్వారానే అంతిమయాత్రలు చేసుకునేందుకు ఎటువంటి ఆంక్షలు, అడ్డంకులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్ ఆర్ ఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కనీస వసతులు లేని దళితుల స్మశానవాటికను వెంటనే అభివృద్ధి చేయాలని కూడా వారు కోరారు.
అమలాపురం,
20.03.2026.