Author name: Human Rights Forum

Books (Telugu)

కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం

రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్‌ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్‌, సచార్‌ కమిషన్‌ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది పొందే లేదా నష్టపోయే వర్గాలు మాత్రమే ఈ నివేదికలను చదివి వాటి సిఫార్సులను అమలు చేయమనో, తిరస్కరించమనో ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తుంటాయి. అవే ఎక్కువగా మీడియాలో వార్తలుగా వస్తుంటాయి. అయితే బాలగోపాల్‌ గారు తన హక్కుల ప్రయాణం ప్రారంభ దశ నుండి ప్రజా ప్రయోజనం ఉన్నాయనుకున్న అన్ని కమిటీలకు, కమిషన్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిషన్ల నివేదికలపై కూడా స్పందిస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య సంవాదంలోనూ, సామాజిక న్యాయ సాధనలోనూ వాటి పాత్రను ఆయన గుర్తించి, గౌరవించినట్టుగా ఇంకెవరూ చేసినట్టు కనిపించదు.

Books (Telugu)

రిజర్వేషన్ల వర్గీకరణ – ప్రజాస్వామిక దృక్పథం

తమ న్యాయమైన వాటా అడిగే వర్గానికి, ముఖ్యంగా నాయకత్వానికి, తమ ఈ భౌతిక పరిస్థితికి కారణం ఎవరు, మనం ఎవర్ని లక్ష్యంగా చేసుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఏమిటి అనేది అవగాహన ఉండాలి. తమ డిమాండు ఎంత  న్యాయమైనదైనా తమ వేదికల నుండి వెళ్లే సందేశం దీర్ఘకాలికంగా నష్టం చేయకుండా ఉండాలి . ముఖ్యంగా సామాజిక అంతరాల పరిష్కారంలో అవతలి పక్షం మనసులు గెల్చుకోవటం అనేది సమస్య పరిష్కారాన్ని ఎంతో సులభతరం చేస్తుంది. అలాగే ఏ కారణాల వలన తాము ఒక న్యాయమైన సదుపాయాన్ని సాధించుకున్నామో దాన్ని తమలోని వారికే నిరాకరించడం, అందుకు ఆధిపత్య కులాల వారి వాదనలనే ఆలంబన చేసుకోవడం వర్గీకరణ వ్యతిరేకవాదులకు కూడా తగని పని. తమ వెనుకబాటుకు ఏ రకంగా కూడా కారణం కాని, తమతో పాటు సామాజిక వెలిని అనుభవించిన కులంలోని తటస్తుల, ఉదారవాదుల మద్దతునైనా మాదిగ ఉద్యమం కూడగట్టుకోలేకపోవడం ఒక సమస్య అయితే, మాల వర్గంలోని మేధావులు ఈ విషయంలో తీసుకోవాల్సినంత చొరవ తీసుకోకపోవడం మరో సమస్య. ఏది ఏమైనా అది గతచరిత్ర. ఇప్పుడు ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాం. వర్గీకరణను ఇంకా వ్యతిరేకిస్తూ వస్తున్న వాదనల్లో చాలావరకు కాలం చెల్లినవి లేదా పూర్తిగా అసంబద్ధమైనవి. వర్గీకరణను ఎలా చేయాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని హేతుబద్ధంగా పరిష్కరించుకోవచ్చు.

Books (Telugu)

రాజ్యం మతం కులం

రాజ్యం మతం కులం, మానవ హక్కుల వేదిక ప్రచురణ మా మాట బాలగోపాల్‌ ఎప్పుడో ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని ఏడాది క్రితం 64 పేజీల ఒక చిన్న

Press Statements (Telugu)

అధికారుల అలసత్వం వల్లే యువకుడుపై ఆక్వా రైతుల దాడి

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో అక్రమ ఆక్వా సాగుపై హైకోర్టు ఉత్తర్వులని అమలు చేయటంలో అలసత్వం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, బాధితుడు చిక్కం వీరదుర్గాప్రసాద్

Fact Finding Reports (Telugu)

ఆరోర్ ఫార్మాసిటికల్స్ కంపెనీలో సంభవించిన ప్రమాదం మీద ప్రాథమిక నివేదికను విడుదల చేయాలి

నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు

Press Statements (Telugu)

మానవ హక్కుల వేదిక 10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలి

మానవ హక్కుల వేదిక (HRF) ఈనెల 14, 15 తేదీలలో (శని, ఆదివారం )10వ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహాసభలు అనంతపురంలో జరుపుకుంటుంది. అనంతపురం లోని సాయి

Scroll to Top