చెంచు మహిళ ఈశ్వరమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలి; నిందితులను కఠినంగా శిక్షించాలి.

చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత పాశవికంగా దాడి చెసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని మహిళ, ఎస్సీ,ఎస్టీ కమిషన్లో డీబీఎఫ్ పిర్యాదు చేసినట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పీ.శంకర్, రాష్ట్ర కల్పన, మానవ హక్కుల వేదిక సభ్యులు సంజీవ్, శ్రావ్య తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులకు ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న ఈశ్వరమ్మను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రాష్ట్ర కల్పన, మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ సభ్యులు సంజీవ్, శ్రావ్య బృందం పరామర్శించడం జరిగిందన్నారు. మానవ మృగమైన ప్రధాన నిందితుడు బండి శివను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈశ్వరమ్మ భూమిని వారికి అందచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం రూ. 5 లక్షల నష్టపరిహారం అందజేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్లు స్పందించి బాధితురాలి తరపున నిలబడాలని కోరారు.

Related Posts

Scroll to Top