ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులపై అమానుష హింసను ప్రయోగించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

తేదీ 20 జూలై 2026 సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా వారి ప్రధాన డిమాండ్ గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో పాటు అమరణ నిరాహార దీక్షలో ఉన్న సోనం వాంగ్ చుక్ విడుదల అలాగే నీట్ పేపర్ లీక్ వల్ల నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అనే ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లతో నిరసన చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం పోలీసుల ద్వారా విచక్షణ రహితమైన హింసకు ఆమానవీయ పద్ధతుల్లో దాడులకు పాల్పడింది. ఈ రకమైన హింసాత్మక చర్యలను ఖండిస్తూ విద్యార్థులపై హింసకు పాల్పడ్డ పోలీసులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన విచారణ జరిపి శిక్షించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తా ఉన్నది.

నీట్ పేపర్ లీకై సుమారు 20 మంది విద్యార్థులు మరణించినప్పటికీ నోరు మెదపని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేస్తే కానీ కదలలేదు.
దీని అర్థం ప్రజలు గొంతు ఎత్తితే కానీ చట్టం తన పని తాను చేయదన్నమాట. ఇంత నిష్క్రియాపరమైన ప్రభుత్వం తిరిగి విద్యార్థులు పై హింసను ప్రయోగిస్తూ ఉన్నది.
ఇది దారుణం గత 12 ఏళ్ల పరిపాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అవినీతి జరగని మంత్రిత్వ శాఖ లేదు. ఇకపోతే ప్రశ్నించే ప్రతి వారిని పాకిస్తాన్ ఏజెంట్ అని చైనా ఏజెంట్ అని దేశద్రోహి అనటం పరిపాటి అయిపోయింది. ఒకవేళ వారన్నదే నిజం అయితే వారి దృష్టిలో ఈ దేశంలో మెజారిటీ ప్రజలు దేశద్రోహులే అన్న మాట. ఎంత విడ్డూరమైన వాదన ఇది. అందుచేత ప్రభుత్వ నియంతృత్వాన్ని పోలీసుల విచక్షణ రహితమైన దాడుల్ని మానవ హక్కుల వేదిక ఖండిస్తూ అంబేద్కర్ సర్కిల్ హనుమకొండలో ఈరోజు నిరసన ప్రదర్శన నిర్వహించింది.

ఈ నిరసన ప్రదర్శనలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులపై అమానుష హింసను ప్రయోగించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరణించిన విద్యార్థి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం తక్షణం చెల్లించాలని మనవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ నిరసన ప్రదర్శనలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బదావత్ రాజు రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ జిల్లా అధ్యక్షులు యాదగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమాన్ ప్రసాద్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, ప్రకాష్, కర్ణాటక సమ్మయ్య పాల్గొన్నారు.

25-07-2026,
హన్మకొండ.

Related Posts

Scroll to Top