శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలోని గిరగాని సురేష్ పై శాలిగౌరారం ఎస్సై మరియు కానిస్టేబుల్స్ కలిసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని మానవ హక్కుల వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు అక్కెనపల్లి వీరస్వామి, రాష్ట్ర నాయకులు జి మోహన్ మరియు జిల్లా నాయకులు జి వెంకటరమణ సంయుక్తంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపినారు.
ఈ విషయమై వారు సురేష్ కుటుంబ సభ్యులను వివరణ అడగగా మే ఒకటవ తారీఖు నాడు జరిగిన గొడవ విషయంలో నిందితులను ఏకపక్షంగా శాలిగౌరారం పోలీస్ కానిస్టేబుల్స్ ఆరోజు రాత్రి సద్దుమణిగిన గొడవను ఎక్కువ చేస్తూ నిందితులను కొట్టుచు మహిళా అని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ భౌతిక దాడికి దిగి తిరిగి మరునాడు ఉదయం ప్రధాన నిందితుడైన గిరగాని సురేష్ ను స్టేషన్కు తీసుకువచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించినారని నిందితుడి భార్య ఎస్సై కాళ్ళ మీద పడినను సురేష్ ను వదలకుండా లాకప్ లోకి తీసుకెళ్లి ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ గారు నిందితుడిని విపరీతంగా కొట్టడం వలన నిందితుడి కర్ణ బేరి పూర్తిగా డ్యామేజ్ అయింది. నిందితుడి తల్లిదండ్రులను, నిందితుడిని అదే రోజు నకిరేకల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు రిమాండ్ చేయగా వారు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులను నోటీసు ఇవ్వకుండా రిమాండ్కు తీసుకురావడం కరెక్ట్ కాదని రిమాండ్ రిటన్ చేసినారని తెలిపినారు. జడ్జిగారు ముందు నిందితుడు పోలీసు వారు కొట్టిన దెబ్బల గురించి చెప్పినచో బెయిల్ తొందరగా రాదని గాయాల గురించి చెప్పకుండా నిందితుడి నోరు మూయించినారని తెలిపినారు.
ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రభుత్వము ఎన్ని కార్యక్రమాలు చేసినను పోలీసు అధికారులు మాత్రం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటూ సామాన్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఈ ఘటనకు కారణమైనటువంటి శాలిగౌరారం ఎస్సై మరియు కానిస్టేబుల్స్ పై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తూ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి గాయపడిన సురేష్ కు ప్రభుత్వమే వైద్యం చేయించాలని, ఉమ్మడి నల్గొండ జిల్లా మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది
04.05.2026,
నల్గొండ.