అక్రమార్జనే పరమావధిగా రివిన్యూ అధికారులు చేస్తున్న అక్రమాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధ్యులను విధులనుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల వేదిక (HRF) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యాల శ్రీనివాసరావు అన్నారు.
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని కేశనపల్లి చేసిన నిజ నిర్థారణ వివరాలను ఆయన శుక్రవారం స్థానిక పాత్రికేయులకు విడుదల చేసారు. మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన కుంపట్ల పద్మ అనే మహిళకు గత ప్రభుత్వ పాలన కాలంలో సర్వే నంబరు 333/12 లో ఒక సెంటున్నర విస్తీర్ణం గల ప్లాట్ -6ను కేటాయించారని తెలిపారు. సదరు స్థలం చుట్టూ కంచె వేసుకుని సదరు మహిళ స్వాధీన పరుచుకుని ఉందని వివరించారు. ఈ క్రమంలో స్థానిక రివిన్యూ అధికారులు పద్మ పేరిట పట్టా మరియు స్వాధీనం ఉన్న స్థలాన్ని గిరుగు వినీత పేరిట పట్టా మార్పుచేసినట్లు తమ నిజనిర్ధారణ లో తేలిందని శ్రీనివాసరావు వివరించారు.వినీత పేరిట గల పట్టా
రి.సర్వే నంబరు 207/5 సెంటున్నర విస్తీర్ణం గల 9వ ఫ్లాట్ స్థలాన్ని పద్మ పేరిట మార్చారని అన్నారు.ఈ తతంగమంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అన్నారు. వినీత భర్త రాజశేఖర్ మరియు రివెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో ప్రధాన దోషులుగా ఉన్నారని అన్నారు.అంతేకాక వినీత భర్త పద్మపై దాడిచేసి ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు.ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఒంటరి మహిళకు అన్ని విధాలా ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి మంద సత్యనారాయణ, డెమెక్రటిక్ ట్రెడిషనల్ ఫిష్ వీవర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిచింత శ్రీనివాస్ పాల్గొన్నారు.
-ముత్యాల శ్రీనివాసరావు,
కేసినపల్లి.
29-5-2026.