బానోతు దీపిక తల్లిదండ్రులను చంపిన ఉన్మాదిని శిక్షించాలి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లాయి గూడెం గ్రామ హామ్లెట్ 16 చింతల తండాలో 11వ తేదీ గురువారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యల విషయంలో ఈరోజు మానవహక్కుల వేదిక బృందం బాధితులను కలిసి వివరాల సేకరించింది. మా నిజనిర్ధారణ బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి హరికృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షులు అద్దునూరి యాదగిరి మరియు పద్మజలు పాల్గొన్నారు.

16 చింతల తండాలో నివాసం ఉండే బానోతు శ్రీనివాస్ సుగుణ దంపతుల కుమార్తె దీపికను మేకల నాగరాజు అనే ఒక ఆటో డ్రైవర్ గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు పెద్దలకు చెప్పకుండా దీపికను బెదిరించి చెబితే మీ తల్లిదండ్రులను నిన్ను మీ తమ్ముడిని చంపివేస్తానని పదేపదే బెదిరించడం వల్ల తను మిన్నకుండిపోయింది. ఈ నేపథ్యంలో నాగరాజు దీపికను తనతో నవంబర్ 29 2023 న బలవంతంగా తీసుకువెళ్లి తల్లిదండ్రులు ఉండే హైదరాబాదులోని జీడిమెట్లలో ఉంచాడు. అప్పటినుండి సుమారు రెండు నెలల పాటు ఆమె పై భౌతికంగా దాడి చేస్తూ తనపై తీవ్రమైన హింసను ప్రయోగిస్తూ పారిపోతే చంపేస్తానని హింసించేవాడని దీపిక తెలిపింది. ఒక నాగరాజు కాదు అతని తల్లిదండ్రులు కూడా ఆమెను వేధించారని పాపం ఆమె వాపోయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు దీపిక తల్లిదండ్రులు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు మాత్రం ఆ కేసును ఎఫ్ఎఆర్ చేసినట్టుగా లేదు. చివరికి ఆ అమ్మాయి హైదరాబాదులో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు జనవరిలో అమ్మాయి కుటుంబాన్ని అబ్బాయి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఈ కౌన్సిలింగ్ నిర్వహణ కూడా పూర్తిగా పక్షపాతంతో జరిగినట్టుగా మా నిజ నిర్ధారణలో తేలింది. రెండు నెలల పాటు ఒక అమ్మాయిని తన ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లిదండ్రుల దగ్గర దాచి ఉంచిన నాగరాజు పై ఆ కుటుంబం పై కిడ్నాప్ కేసును నమోదు చేయకపోగా ఏమీ జరగదని, కేసు అవసరం లేదని ఎస్ఐ, దీపిక కుటుంబాన్ని మభ్యపెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. చివరికి ఈ రకమైన కౌన్సెలింగ్ నిర్వహణ తరువాత అబ్బాయి, అమ్మాయి కుటుంబంతో ఎటువంటి సంబంధం లో ఉండడని ఏ రకంగా బెదిరించడని ఇకపై అతనికి అతని కుటుంబానికి మీకు ఎటువంటి సంబంధం ఉండదని ఆ ఎస్.ఐ హామీ ఇచ్చినట్లుగా దీపిక చెబుతూ ఉన్నది. ఆ తరువాత నెలపాటు ఇక్కడే ఆటో నడుపుకుంటూ ఉన్న నాగరాజు ఆన్లైన్లో హత్యకు ఉపయోగించిన కత్తిని ఆర్డర్ చేసుకొని ఇతర ఇద్దరు ముగ్గురు మిత్రుల సహకారంతో రెక్కి నిర్వహించి జూలై 11వ తేదీన తెల్లవారుజాము ఒంటిగంట రెండు ప్రాంతాల్లో వచ్చి ఆరు బయట నిద్రిస్తున్న దీపిక ఆమె తల్లిదండ్రులను హత్య చేయడానికి ప్రయత్నించాడు ఈ క్రమంలో దీపిక తప్పించుకుంటే తండ్రిని తల్లిని దారుణంగా అనేకసార్లు పొడిచి హత్య చేశాడు. ఈ విషయంలో నాగరాజుకు సహకరించిన ఏ ఒక్కరి పైన కేసు నమోదు కాలేదు. వారెవరు అరెస్ట్ కాలేదు కేవలం ఒక నాగరాజును మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు వేదిక తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని కోరుతూ ఉన్నది. పితృస్వామ్యం, పోలీసుల నిర్లక్ష్యం కలిసి చేసిన హత్య ఇది..

మా డిమాండ్లు

*అమానుషంగా శ్రీనివాస్ సుగుణలను హత్యగావించిన నాగరాజు త్వరితగతిన విచారణ జరిపి శిక్షించా

*తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మారిన దీపిక మదన్ లా విద్యకు వారి భవిష్యత్తుకు ప్రభుత్వమే పూచిపడాలి

*కుటుంబం పై ఆధారపడ్డ వృద్ధులకు, పిల్లల భవిష్యత్తుకు తక్షణం తక్షణం 50 లక్షల ఎక్స్రేషియా అందించాలి

*కిడ్నాప్ కేసు నమోదు చేయని పోలీసులపై చర్య తీసుకోవాలి

చెన్నారావుపేట,
14.07.2024.

Related Posts

Scroll to Top